News March 4, 2025

నేడు మంగళగిరికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పార్టీ ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థులపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 4, 2025

ఆధిక్యంలో పేరాబత్తుల రాజశేఖరం

image

AP: తూ.గో-ప.గో జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 28 టేబుళ్లలో జరుగుతున్న కౌంటింగ్‌లో నాల్గవ రౌండ్ పూర్తయ్యే నాటికి 1,02,236 ఓట్లు చెల్లుబాటు అయినట్లు గుర్తించారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 64,405 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు 23,252 ఓట్లు పొందారు. 41,153 ఓట్ల మెజార్టీతో రాజశేఖరం ఉండగా, ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

News March 4, 2025

టీమ్ ఇండియా ఫైనల్ చేరేనా?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ జరిగే సెమీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాలని టీమ్ ఇండియా భావిస్తోంది. వన్డే వరల్డ్ కప్‌లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్ కూడా ఈ మ్యాచులో నెగ్గి ఫైనల్లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

News March 4, 2025

తిరుమల అన్నప్రసాదంలో వడలు?

image

AP: శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ నెల 6 నుంచి వడలు కూడా అందించనున్నట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా జనవరిలో వారంపాటు రోజుకు 5 వేల చొప్పున వడలను వడ్డించారు. అయితే లక్ష మంది భక్తులకు వడ్డించేందుకు సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించారు.

error: Content is protected !!