News September 12, 2025
సీఎం చంద్రబాబు ఇవాళ్టి షెడ్యూల్

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ ఉ.9.30 గంటలకు జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.
* ఉ.11.55 గంటలకు ఢిల్లీ నుంచి అమరావతి బయలుదేరుతారు.
* మ.2.45 గంటలకు మంగళగిరిలోని CK కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు.
* మ.3.00 గంటలకు Way2News కాన్‌క్లేవ్‌లో పాల్గొంటారు.
* సాయంత్రం 4.15 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
Similar News
News March 28, 2026
4 లీటర్ల పెట్రోల్ దాచాడని 3 వారాలు జైలు శిక్ష

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇంధన కొరతతో దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 లీటర్ల పెట్రోల్ దాచాడనే కారణంతో శ్రీలంక కోర్టు బాలసూర్య అనే వ్యక్తికి 3 వారాల జైలు శిక్ష, రూ.1,500 ఫైన్ విధించింది. అతను అక్రమంగా పెట్రోల్‌ను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే ప్రయత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు. అయితే తాను ఇంటి పరిసరాల్లో చెత్తను కాల్చేందుకు తెచ్చుకున్నానని నిందితుడు తెలిపారు.
News March 28, 2026
నేడు గంటపాటు లైట్లు బంద్ చేయండి

పర్యావరణ పరిరక్షణ కోసం ‘ఎర్త్ అవర్’ పాటించాలనే సంప్రదాయం 2007లో మొదలైంది. ఈసారి మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 గం. వరకు ఒక గంటపాటు అనవసర విద్యుత్ దీపాలను ఆర్పివేసి ఈ కార్యక్రమంలో భాగం కావాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంచడం, సుస్థిర భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యంగా ఈ చిన్న ప్రయత్నం పర్యావరణంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.
News March 28, 2026
భారత్ నుంచి శ్రీలంక, బంగ్లాకు 53వేల టన్నుల పెట్రోల్, డీజిల్

ఇంధన సంక్షోభం వేళ శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు భారత్ అండగా నిలిచింది. శ్రీలంకకు 20వేల టన్నుల డీజిల్, 18 వేల టన్నుల పెట్రోల్ పంపింది. బంగ్లాకు 5వేల టన్నుల డీజిల్ పంపించింది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి 15వేల టన్నుల డీజిల్ వచ్చినట్లు బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. వచ్చే నెలలో 45వేల టన్నుల డీజిల్ రానుందని పేర్కొంది. ఈ సంక్షోభ సమయంలో ఆ దేశాలకు పంపడం అవసరమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


