News June 26, 2024
చిన్నారికి నామకరణం చేసిన సీఎం చంద్రబాబు

AP: చిత్తూరు(D) కుప్పంలో CM చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. R&B గెస్ట్ హౌస్‌లో ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తుండగా.. శాంతిపురం మండలానికి చెందిన సుధాకర్, ప్రియ దంపతులు తమ రెండో కుమార్తెకు నామకరణం చేయాలని CBNను కోరారు. ముద్దులొలికే చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న బాబు ‘చరణి’ అని పేరు పెట్టారు. తమ బిడ్డకు సాక్ష్యాత్తూ సీఎం పేరు పెట్టడంతో తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Similar News
News February 17, 2025
పండ్ల మార్కెట్లో అగ్నిప్రమాదం

AP: రాజమండ్రి దివాన్‌చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్‌లోని కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. వ్యాపారులు వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
News February 17, 2025
ప్రార్థనా స్థలాల చట్టం కేసు: సుప్రీంకోర్టు అసంతృప్తి

ప్రార్థనా స్థలాల చట్టం కేసుపై కుప్పలు తెప్పలుగా కొత్త పిటిషన్లు రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ముగ్గురు సభ్యుల బెంచ్ వాదనలు వినడంతో ఇద్దరితో కూడిన తమ బెంచ్ పెండింగ్ పిటిషన్లను తీసుకోబోదని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘పిటిషన్లు వేయడానికీ ఓ పరిమితి ఉంటుంది. తాజాగా మరిన్ని వచ్చాయి. వాటిని మేం స్వీకరించలేం. మార్చిలో కొత్త తేదీ ఇస్తాం’ అని తెలిపారు.
News February 17, 2025
కాంగ్రెస్‌పై విపక్షాలది తప్పుడు ప్రచారం: మంత్రి శ్రీధర్ బాబు

TG: జనాభా ప్రకారం BCలకు రిజర్వేషన్లు కల్పించాలని కులగణన చేపట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లిలో పట్టభద్రుల MLC అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో ఆయన మాట్లాడారు. BC రిజర్వేషన్ల కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.