News August 14, 2024
16న ఢిల్లీకి సీఎం చంద్రబాబు?
ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది. అమరావతి, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాల రీషెడ్యూల్ సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రంతో CM చర్చించనున్నట్లు సమాచారం.
Similar News
News September 10, 2024
ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే వేదికపైకి తారక్, అల్లు అర్జున్?
ఈరోజు జరిగే ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారనే చర్చ నడుస్తోంది. తారక్, బన్ని ‘బావ’ అని ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ ఈవెంట్‌కు బన్ని రానున్నారని సమాచారం. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. పాటలు హిట్ అయిన తరుణంలో ట్రైలర్‌పైనా భారీ అంచనాలున్నాయి.
News September 10, 2024
బిల్లులు క్లియర్ చేయండి: యూనస్‌కు అదానీ లేఖ
బంగ్లా పవర్ బోర్డు నుంచి రావాల్సిన $800 మిలియన్ల బకాయిలను త్వరగా ఇప్పించాలని ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్‌ను అదానీ పవర్ కోరింది. ఈ అంశంలో జోక్యం చేసుకొని బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని లేఖ రాసింది. ఝార్ఖండ్ ప్లాంట్ నుంచి అదానీ కంపెనీ బంగ్లాకు విద్యుత్ సరఫరా చేస్తోంది. నెలకు $90-95 మిలియన్లు తీసుకుంటుంది. కొన్ని నెలలుగా అందులో సగం వరకే చెల్లిస్తుండటంతో బకాయిలు పేరుకుపోయాయి.
News September 10, 2024
ప్రమాదాలను నివారించిన రైల్వే సిబ్బందికి సన్మానం
TG: భారీ వర్షాల సమయంలో రైల్వే ట్రాక్‌లు ధ్వంసమైన ప్రదేశాలను గుర్తించి పైఅధికారులకు చెప్పి, ప్రమాదాలను నివారించిన వారిని రైల్వేశాఖ సన్మానించింది. సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆరుగురు సిబ్బందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. G.మోహన్(ఇంటికన్నె), B.జగదీశ్(తాళ్లపూసపల్లి), K.కృష్ణ, B.జైల్‌సింగ్, V.సైదానాయక్, P.రాజమౌళి(మహబూబాబాద్) ఉన్నారు.