News November 20, 2024

జనవరిలో స్విట్జర్లాండ్‌కు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు వచ్చే ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. అక్కడ జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయనతోపాటు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. సీఎం పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు అధికారుల బృందం నిన్న దావోస్‌కు పయనమైంది.

Similar News

News March 13, 2026

SEBI హోల్ టైమ్ మెంబర్‌గా తెలుగు వ్యక్తి!

image

స్టాక్ మార్కెట్లను పర్యవేక్షించే సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో తెలుగు వ్యక్తికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. SEBI హోల్ టైమ్ మెంబర్‌గా మాజీ IDAS అధికారి కేవీ రమణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా SEBIలో పార్ట్‌టైమ్ మెంబర్‌గా పనిచేశారు. సెబీ నిర్ణయాల్లో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు.

News March 13, 2026

ఇళ్లు లేనివారికి శుభవార్త

image

AP: రాష్ట్రంలో అర్హులందరికీ రెండేళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున అందజేయాలని స్పష్టం చేశారు. అందుబాటులో ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీల్లో మంజూరైన ఇళ్లు వద్దనుకుంటే రద్దు చేసి, అక్కడే లేదా మరో చోట 3 సెంట్లు ఇవ్వాలని పేర్కొన్నారు.

News March 13, 2026

యుద్ధం.. రూ.23.44 లక్షల కోట్లు ఆవిరి

image

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి BSE సెన్సెక్స్ 5,252 పాయింట్లు(6.46%) తగ్గినట్లు PTI వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంపద ₹23.44L Cr క్షీణించిందని తెలిపింది. 30 BSE లిస్టెడ్ కంపెనీల విలువ ₹440L Crకు పడిపోయినట్లు పేర్కొంది. జియో పాలిటిక్స్ టెన్షన్స్, క్రూడాయిల్ ధరలు పెరగడం, LNG ఉత్పత్తి తగ్గడం, రూపాయి ధర పతనం దీనికి ప్రధాన కారణాలని చెప్పింది.