News February 6, 2025

25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు

image

AP: శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 25వ తేదీన సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏటా మహాశిరాత్రికి(ఫిబ్రవరి 26) ముందు రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటిదాకా మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించేవారు. ఈసారి సీఎం హాజరుకానున్నారు.

Similar News

News February 6, 2025

INDvsENG: నేడే తొలి వన్డే.. మ.1.30 గంటలకు ప్రారంభం

image

నాగ్‌పూర్ వేదికగా నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి ODI జరగనుంది. మ.1.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20ల్లో చూపిన జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని IND ఉవ్విళ్లూరుతోంది. రోహిత్, కోహ్లీ, గిల్, రాహుల్, శ్రేయస్, హార్దిక్, అక్షర్, జడేజా, షమీ, అర్ష్‌దీప్, కుల్దీప్, సుందర్, వరుణ్‌లతో జట్టు సమతూకంగా ఉంది. అటు వన్డేల్లో బోణీ కొట్టాలని ENG ఆరాటపడుతోంది. స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

News February 6, 2025

ఉపాధి కూలీలకు ₹6,434 కోట్లు బకాయి పడిన కేంద్రం

image

MGNREGA పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు కేంద్రం చెల్లించాల్సిన వేతనాలు బకాయిలు రూ.6,434 కోట్ల వరకూ ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కమలేశ్ ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. అత్యధికంగా తమిళనాడుకు రూ.1652 కోట్లు, UPకి రూ.1214 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక 2022-23 కాలంలో దేశవ్యాప్తంగా 86.17 లక్షలమంది, 2023-24లో 68.86 లక్షలమంది కూలీలను తొలగించినట్లు వెల్లడించారు.

News February 6, 2025

రుణం కంటే రెట్టింపు వసూలు.. విజయ్ మాల్యా పిటిషన్

image

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన పారిశ్రామికవేత్త కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.6,200 కోట్ల అప్పునకు బ్యాంకులు రూ.14,131 కోట్ల ఆస్తులను రికవరీ చేశాయని తెలిపారు. అయినా ఇంకా జప్తు కొనసాగుతోందని, దీనిపై స్టే విధించాలని కోరారు. ఈ అంశంపై ఈ నెల 13లోగా స్పందించాలని న్యాయస్థానం 10 బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది.

error: Content is protected !!