News June 15, 2024
ఆ అధికారులను దూరం పెట్టనున్న CM చంద్రబాబు!

AP: అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వైసీపీకి అంటకాగి కళంకితులుగా పేరు తెచ్చుకున్న అధికారులను దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమర్థ అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక పోస్టింగ్స్ ఇచ్చే యోచనలో ఉన్నారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని CBN భావిస్తున్నారు.
Similar News
News October 21, 2025
ట్రంపే కాదు.. ఆయన సెక్రటరీ అంతే!

US ప్రెసిడెంట్ ట్రంప్ నోటి దురుసు గురించి తెలిసిందే. ఈ విషయంలో తానేం తక్కువ కాదని వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ నిరూపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు త్వరలో ట్రంప్, పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో భేటీ కానున్నారు. ఈ హైలెవెల్ సమ్మిట్‌కు ఆ లొకేషన్ ఎవరు ఎంపిక చేశారని ఓ జర్నలిస్ట్ కరోలిన్‌కు మెసేజ్ చేశారు. ‘మీ అమ్మ చేసింది’ అని ఆమె బదులివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
News October 21, 2025
H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్‌న్యూస్

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. USలో చదువుతున్న వారికి హెచ్-1బీ వీసా ఫీజు నుంచి సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ మినహాయింపు కల్పించింది. అమెరికా బయటి నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేసింది.
News October 21, 2025
నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, UAEలలో 3 రోజులు పర్యటిస్తారు. వచ్చేనెల విశాఖలో జరిగే CII సదస్సుకు రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి రంగాలకు చెందిన వ్యాపారవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. CM వెంట మంత్రులు TG భరత్, జనార్దన్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లనున్నారు.