News June 15, 2024
ఆ అధికారులను దూరం పెట్టనున్న CM చంద్రబాబు!

AP: అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. వైసీపీకి అంటకాగి కళంకితులుగా పేరు తెచ్చుకున్న అధికారులను దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమర్థ అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక పోస్టింగ్స్ ఇచ్చే యోచనలో ఉన్నారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని CBN భావిస్తున్నారు.
Similar News
News July 6, 2025
డిజిటల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సప్, స్కైప్‌ల ద్వారా వీడియో కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సైబర్ నేరం జరిగితే https://cybercrime.gov.in/కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News July 6, 2025
శుభ సమయం (06-07-2025) ఆదివారం

✒ తిథి: శుక్ల ఏకాదశి రా.8.15 వరకు తదుపరి ద్వాదశి
✒ నక్షత్రం: విశాఖ రా.10.37 వరకు తదుపరి అనురాధ
✒ శుభ సమయం: సామాన్యము
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: తె.3.03-4.49 వరకు
✒ అమృత ఘడియలు: మ.12.50-2.36 వరకు
News July 6, 2025
నేటి ముఖ్యాంశాలు

* పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: రేవంత్
* ఈనెల 12 నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ: భట్టి
* ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
* చర్చకు ప్రిపేరయ్యేందుకు 72 గంటల సమయం: కేటీఆర్
* మహిళలకు 5వేల ఈవీ ఆటోలు: మంత్రి పొన్నం
* AP: వచ్చే జూన్ నాటికి వెలిగొండ పూర్తి చేయాలి: సీఎం
* వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు
* 20,494 ఎకరాల భూ సమీకరణకు CRDA ఆమోదం: మంత్రి