News November 23, 2024
‘మహాయుతి’కి సీఎం చంద్రబాబు విషెస్
AP: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న మహాయుతి కూటమికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం ఏక్నాథ్ శిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు ఆయన ఫోన్ చేసి హర్షం వ్యక్తం చేశారు. కాగా మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇవాళ సాయంత్రానికి నిర్ణయిస్తారు. శిండే, ఫడణవీస్, అజిత్ ముగ్గురూ సీఎం రేసులో ఉన్నారు.
Similar News
News November 23, 2024
రోహిత్ శర్మను మిడిలార్డర్లో ఆడించాలి: మాజీ బౌలర్
రోహిత్ శర్మ వచ్చిన తర్వాత కూడా కేఎల్ రాహుల్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని భారత మాజీ బౌలర్ దొడ్డ గణేశ్ అభిప్రాయపడ్డారు. జైస్వాల్, రాహుల్ కాంబినేషన్ బాగుందని, సిరీస్ అంతా వీరిద్దరినే కొనసాగించాలని సూచించారు. ‘ఈ ఓపెనింగ్ భాగస్వామ్యం కొనసాగాలి. రోహిత్ మిడిలార్డర్లో ఆడొచ్చు. కామన్ సెన్స్‌తో ఆలోచిస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News November 23, 2024
అజిత్, శిండే విజయాల్లో క్యాంపెయిన్ టీం కృషి
Do or Die అన్నట్టుగా ఫైట్ చేసిన శివసేన శిండే వర్గం 55 సీట్లలో, NCP అజిత్ వర్గం 40 సీట్ల వరకు విజయం సాధిస్తుండడం వెనుక ఈ పార్టీల వ్యూహకర్తల కృషి కూడా ఉంది. అజిత్ పవార్ కోసం పనిచేసిన నరేశ్ అరోరా(Design Boxed) పింక్ థీమ్‌తో NCPకి విజయాన్ని అందించారు. శిండేను Man of Massesగా ప్రొజెక్ట్ చేయడం, మహిళలకు ఆర్థిక సాయం పథకంపై ఆయన వ్యక్తిగత క్యాంపెయిన్ టీం చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకోగలిగింది.
News November 23, 2024
60% ముస్లిం ఓట్లు.. 11 మంది ముస్లిం అభ్యర్థులు: భారీ విజయంవైపు BJP
UPలోని కుండార్కి బైఎలక్షన్లో BJP రికార్డులు బద్దలుకొట్టనుంది. 30 ఏళ్ల తర్వాత విజయం సాధించబోతోంది. 60% ముస్లిములు ఉండే ఈ సీట్లో BJP అభ్యర్థి రామ్‌వీర్ సింగ్ 19/32 రౌండ్లు ముగిసే సరికి 98,537 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ఆయనకు 1,11,470 ఓట్లు రాగా SP అభ్యర్థి మహ్మద్ రిజ్వాన్‌కు 12,933 ఓట్లే వచ్చాయి. ఈ ఎన్నికల్లో 11 మంది ముస్లిం అభ్యర్థులతో తలపడి రామ్‌వీర్ విజయం సాధించబోతుండటం సంచలనంగా మారింది.