News November 23, 2024

‘మహాయుతి’కి సీఎం చంద్రబాబు విషెస్

image

AP: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న మహాయుతి కూటమికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం ఏక్‌నాథ్ శిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు ఆయన ఫోన్ చేసి హర్షం వ్యక్తం చేశారు. కాగా మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇవాళ సాయంత్రానికి నిర్ణయిస్తారు. శిండే, ఫడణవీస్, అజిత్ ముగ్గురూ సీఎం రేసులో ఉన్నారు.

Similar News

News December 7, 2024

మార్చి 15 నుంచి టెన్త్ ఎగ్జామ్స్?

image

AP: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. కొత్త సిలబస్ ప్రకారమే ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే గతంలో పరీక్ష రాసి ఫెయిలైన వారికి పాత సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి తదితర వివరాలు పొందుపరిచారు.

News December 7, 2024

18న గురుకుల సొసైటీ ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: గురుకుల సొసైటీ ప్రవేశాలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఫిబ్రవరి 23న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. జూన్ 12లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం లేదని వెల్లడించారు. పది పాసైన వారికి నేరుగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

News December 7, 2024

తెలంగాణలోనే ఎక్కువ సిజేరియన్లు

image

తెలంగాణలో సిజేరియన్లు ఎక్కువగా ఉన్నట్లు NFHS ఆధారంగా ఢిల్లీలోని జార్జ్ ఇన్‌స్టిట్యూట్ స్టడీ తెలిపింది. ఇక్కడ మొత్తం ప్రసవాల్లో 60.7% సిజేరియన్లేనని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇది 21.5 శాతంగా ఉంది. అత్యల్పంగా నాగాలాండ్‌లో 5.2% సిజేరియన్లు జరుగుతున్నాయి. దక్షిణాదిలోనే సిజేరియన్లు ఎక్కువగా ఉన్నాయి. సహజ ప్రసవాలపై భయం, ముహూర్తాలు చూసుకోవడం, ఆర్థిక స్తోమత వంటి అంశాలు సిజేరియన్లకు కారణాలవుతున్నాయి.