News November 16, 2024

సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్యం విషమం

image

AP: సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు HYDకి బయల్దేరారు. మంత్రి లోకేశ్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు.

Similar News

News July 10, 2025

నాపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు: విద్యా బాలన్

image

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌తో నటించాల్సిన ‘చక్రం’ సినిమా ఆగిపోవడంతో తనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారని నటి విద్యా బాలన్ తెలిపారు. కానీ హీరో, డైరెక్టర్‌కు మధ్య తలెత్తిన భేదాభిప్రాయాల వల్లే ఆ మూవీ ఆగిపోయిందన్నారు. ‘ఆ ఒక్క సినిమా ఆగిపోవడం వల్ల నేను 8-9 ప్రాజెక్టులు కోల్పోయా. రాత్రికి రాత్రే అంతా కోల్పోయా. కొన్ని సినిమాల్లో షూట్ కంప్లీట్ అయ్యాక కూడా నన్ను తొలగించారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

News July 10, 2025

కేజ్రీవాల్‌కు నోబెల్.. బీజేపీ VS ఆప్ వార్

image

పరిపాలనలో తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలన్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అవినీతి, అసమర్థతకు కేజ్రీవాల్ మారుపేరని బీజేపీ విమర్శించింది. అవినీతి కేటగిరీలో ఆయన నోబెల్‌కు అర్హుడంటూ ఎద్దేవా చేసింది. మరోవైపు వ్యక్తి నామస్మరణ మాని పాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని BJPకి ఆప్ కౌంటరిచ్చింది.

News July 10, 2025

పిల్లలు ఫోన్ చూస్తున్నారా?

image

దేశంలో 5 ఏళ్ల లోపు చిన్నారులు మొబైల్, TV చూసే విషయంలో గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. WHO ప్రతిపాదనలను మించి రోజుకు 2.2 గంటలు స్క్రీన్ చూస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. దీనివల్ల స్కిల్స్ తగ్గుతాయని, ఊబకాయం పెరుగుతుందని, నిద్ర అలవాట్లు మారి ఆరోగ్యంపై పాడవుతుందని ఆ సర్వే హెచ్చరించింది. కాగా 2 ఏళ్లలోపు పిల్లలు అసలు స్క్రీన్ చూడొద్దని, 2-5 ఏళ్ల వారు రోజుకు గంట మాత్రమే చూడొచ్చని WHO చెబుతోంది.