News January 2, 2025
CM, Dy.CM న్యూఇయర్ విషెస్
AP: క్యాబినెట్ భేటీ సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం మంత్రులు కూడా వీరిద్దరికి విషెస్ చెప్పారు. కాగా ఇవాళ అమరావతిలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 17, 2025
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు.
News January 17, 2025
అలాంటి ఇళ్ల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్
AP: ఆక్రమణలకు గురైన అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. వీరు 15-10-2019 నాటికి దరఖాస్తు చేసుకుని ఉండాలని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లలో పలు కారణాలతో ఇళ్లు నిర్మించుకోని వారి పట్టాలను రద్దు చేస్తున్నామన్నారు. అలాంటి వారికి కోరుకున్న చోట ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు.
News January 17, 2025
దేశం గర్వించేలా మరింత కష్టపడతా: మనూ భాకర్
ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు అందుకోవడంపై ఒలింపిక్ మెడలిస్ట్, భారత షూటర్ మనూ భాకర్ స్పందించారు. ‘గౌరవ రాష్ట్రపతి నుంచి ఖేల్ రత్న అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నా. ఈ గుర్తింపు నా దేశం గర్వపడేలా చేసేందుకు మరింత కష్టపడి పనిచేయడానికి, విజయాలు పొందేందుకు స్ఫూర్తినిస్తోంది. నాకు మద్దతునిచ్చిన, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.