News March 17, 2024
సీఎం జగన్ దుర్మార్గుడు: చంద్రబాబు

AP: అమరావతిని సీఎం జగన్ నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. ‘కేంద్ర సహకారంలో మేము 70 శాతం పోలవరం పూర్తి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది. లాండ్, శాండ్, మైన్, వైన్స్ పేరుతో దోచేశారు. జే బ్రాండ్ లిక్కర్ ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి తన ఆదాయాన్ని పెంచుకున్న దుర్మార్గుడు జగన్’ అని మండిపడ్డారు.
Similar News
News April 2, 2025
ముంబైని వదిలి గోవాకు?

ముంబై యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. వ్యక్తిగత కారణాలతో వచ్చే సీజన్ నుంచి దేశవాళీ క్రికెట్లో ముంబైని వదిలి గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు NOC కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు ఈమెయిల్ చేసినట్లు తెలుస్తోంది. జైస్వాల్ గోవా జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
News April 2, 2025
బీసీల డిమాండ్ను బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు: సీఎం

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు చేపట్టిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు. బీసీల లెక్క తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని కోర్టులు చెప్పాయని, అందుకే బీసీ కులగణన చేపట్టామని చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయబద్ధమైనదని, దీన్ని బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.
News April 2, 2025
ALERT: ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా?

మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వెకేషన్కు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి మద్రాస్ హైకోర్టు ఈ-పాస్ తప్పనిసరి చేసింది. టూరిస్టుల భద్రత, పర్యావరణ పరిరక్షణ, రద్దీ తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-పాస్ ఉంటేనే నీలగిరి, దిండిగల్ జిల్లాల్లోకి పోలీసులు వాహనాలను అనుమతిస్తారు. ఈ-పాస్ కోసం https://epass.tnega.org/ సైట్లో అప్లై చేసుకోవాలి.