News March 17, 2024
సీఎం జగన్ దుర్మార్గుడు: చంద్రబాబు
AP: అమరావతిని సీఎం జగన్ నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మూడు ముక్కలాటతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. ‘కేంద్ర సహకారంలో మేము 70 శాతం పోలవరం పూర్తి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసింది. లాండ్, శాండ్, మైన్, వైన్స్ పేరుతో దోచేశారు. జే బ్రాండ్ లిక్కర్ ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి తన ఆదాయాన్ని పెంచుకున్న దుర్మార్గుడు జగన్’ అని మండిపడ్డారు.
Similar News
News October 14, 2024
రజినీకాంత్ సినిమాలో ఆమిర్ ఖాన్?
సూపర్ స్టార్ రజినీకాంత్‌తో లోకేశ్ కనగరాజ్ తీస్తున్న లేటెస్ట్ సినిమా ‘కూలీ’లో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూడా మూవీలో నటిస్తారని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సినిమా ఒప్పుకొనేందుకు చాలా టైమ్ తీసుకునే ఆమిర్, కూలీలో పాత్ర గురించి లోకేశ్ చెప్పగానే ఓకే అన్నారని సమాచారం. ఈ నెల 15 నుంచి చెన్నైలో షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.
News October 14, 2024
హర్మన్ ప్రీత్ కౌర్‌పై నెటిజన్ల ఫైర్
మహిళల టీ20 WCలో ఆస్ట్రేలియాపై ఓడి భారత్ సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయింది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌పై ఫైర్ అవుతున్నారు. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె బ్యాటింగ్ చూస్తుంటే టెస్టు క్రికెట్‌ను తలపించిందని ఎద్దేవా చేస్తున్నారు. మ్యాచ్ చివర్లో సింగిల్స్ తీయడం వల్లే మ్యాచ్ ఓటమి పాలైందని కామెంట్లు చేస్తున్నారు.
News October 14, 2024
గుజరాత్‌లో రూ.5వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ పోలీసులు ఇటీవల దేశ రాజధానిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో 700కిలోలకు పైగా కొకెయిన్ పట్టుకున్నారు. విచారణలో గుజరాత్‌లోని అంకలేశ్వర్ సిటీలో ఉన్న ఆవ్‌కార్ డ్రగ్స్ సంస్థ పేరును నిందితులు చెప్పినట్లు సమాచారం. గుజరాత్ పోలీసులతో కలిసి సంయుక్తంగా సంస్థపై దాడులు చేశామని, రూ.5వేల కోట్ల విలువైన 518 కిలోల కొకెయిన్‌ను పట్టుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.