News March 23, 2024
సినీ నటులకు మించిన క్రేజ్ సీఎం జగన్ సొంతం: మంత్రి రోజా

AP: టీడీపీ నేతలకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోసిన వాళ్లకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని దుయ్యబట్టారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక హామీలు ఇచ్చి ఆయన ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సినీ నటులకు లేని క్రేజ్ జగన్‌కు ఉందని చెప్పారు.
Similar News
News September 17, 2025
గొల్లపూడిలో ఉత్సవ్ నిర్వహణకు లైన్ క్లియర్

AP: విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉత్సవ్ నిర్వహణకు అడ్డంకులు తొలగాయి. గొడుగుపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దంటూ నిన్న సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్‌లో సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ అప్పీల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది.
News September 17, 2025
స్మృతి మంధాన సూపర్ సెంచరీ

AUSWతో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగారు. 77బంతుల్లో 12ఫోర్లు, 4సిక్సర్లతో శతకం బాదారు. దీంతో IND తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. తొలి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఆమె పేరిటే ఉండటం విశేషం. గతంలో స్మృతి ఐర్లాండ్‌పై 70 బంతుల్లోనే శతకం నమోదు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన IND టీమ్ 32 ఓవర్లలో 191/3 రన్స్ చేసింది. క్రీజులో స్మృతి, దీప్తి శర్మ(12) ఉన్నారు.
News September 17, 2025
పాక్ ‘ఫేక్ ఫుట్‌బాల్ జట్టు’ను వెనక్కి పంపిన జపాన్

ఫుట్‌బాల్ ఆటగాళ్లమంటూ పాక్ నుంచి తమ దేశానికి వచ్చిన ఫేక్ ప్లేయర్లను జపాన్ వెనక్కి పంపింది. మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఫేక్ ఫుట్‌బాల్ జట్టును సృష్టించి 22 మందిని జపాన్‌కు పంపించాడు. అయితే అక్రమంగా వచ్చిన వారిని అధికారులు హెచ్చరించి వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం నిర్ధారించింది. వకాస్‌ను అరెస్ట్ చేసి విచారించగా 2024లోనూ ఇదే పద్ధతిలో పంపినట్లు తెలిపాడు.