News March 23, 2024

సినీ నటులకు మించిన క్రేజ్ సీఎం జగన్ సొంతం: మంత్రి రోజా

image

AP: టీడీపీ నేతలకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా టీడీపీ జెండా మోసిన వాళ్లకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని దుయ్యబట్టారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా అనేక హామీలు ఇచ్చి ఆయన ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సినీ నటులకు లేని క్రేజ్ జగన్‌కు ఉందని చెప్పారు.

Similar News

News January 18, 2026

ప్చ్.. రో‘హిట్’ అవ్వలేదు

image

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చారు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి ఫౌల్క్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. సిరీస్ మొత్తంగా 61 పరుగులే చేశారు. మరో ఆరు నెలల వరకు వన్డే మ్యాచ్‌లు లేవు. హిట్ మ్యాన్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. మళ్లీ IPL-2026లోనే రోహిత్ ఆటను చూడవచ్చు. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

News January 18, 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

News January 18, 2026

గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

image

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్లు కలిసి ఉన్న మాత్రలు వినియోగించే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్త ప్రవాహం జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టడం వల్ల క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రో‌క్‌లేనని తెలిపారు.