News April 29, 2024

సీఎం జగన్ నేటి ప్రచార షెడ్యూల్

image

AP: సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్, మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని అంబాజీపేట బస్టాండ్ రోడ్డులో, మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో జరిగే సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

Similar News

News November 4, 2024

రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే?

image

TG: రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం ఈనెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని కోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు CM రేవంత్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఒక ఎకరా నుంచి మొదలు పెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎన్ని ఎకరాల వరకు(7.5 లేదా 10) ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయించనున్నట్లు సమాచారం.

News November 4, 2024

యాంటీ ఇండియా ఎలిమెంట్స్‌కు కెనడా అనుమతించడం బాధాకరం: భారత్

image

బ్రాంప్టన్ హిందూ సభా మందిరం వద్ద <<14524265>>ఖలిస్థానీ<<>>ల దాడులపై కెనడాలోని భారత హైకమిషన్ స్పందించింది. స్థానికులతో కలిసి చేపట్టే రెగ్యులర్ కాన్సులర్ క్యాంపులకు అవాంతరాలు కలిగించేలా యాంటీ ఇండియా ఎలిమెంట్స్‌కు అనుమతించడం తీవ్ర నిరాశపరిచిందని తెలిపింది. భారతీయులు సహా లైఫ్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసినవారి భద్రతపై ఆందోళన కలుగుతోందని వెల్లడించింది. అయినప్పటికీ 1000 సర్టిఫికెట్లు జారీచేశామని పేర్కొంది.

News November 4, 2024

పుష్ప-2 క్రేజ్ మామూలుగా లేదుగా!

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కేరళలో ఇప్పటికే 50 ఫ్యాన్స్ షోలకు బుకింగ్ స్టార్ట్ అయినట్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు. కేరళలో మొత్తం 300కు పైగా ఫ్యాన్స్ షోలు ప్రదర్శించడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. DEC5న కేరళలో వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ప్రారంభం కానుందంటూ Xలో పోస్ట్ చేశారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రష్మిక, ఫహాద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్నారు.