News April 2, 2024

పెన్షన్ల జాప్యానికి కారణం సీఎం జగనే: కొల్లు రవీంద్ర

image

AP: రాజకీయ లబ్ధి కోసం పింఛన్లు ఇవ్వకుండా పెన్షనర్లను సీఎం జగన్ వేధిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్ మెప్పు కోసం అబద్దాలే ఎజెండాగా పేర్ని నాని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సేవ చేసే వాలంటీర్లను తాము కొనసాగిస్తామంటే వైసీపీ నేతలకు వణుకెందుని ప్రశ్నించారు. పింఛన్ల జాప్యానికి నూటికి నూరు శాతం కారణం జగనే అని విరుచుకుపడ్డారు.

Similar News

News October 6, 2024

రజినీ-మణిరత్నం కాంబోలో సినిమా?

image

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నం కలిసి చివరిగా 1991లో ‘దళపతి’కి పనిచేశారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కమల్ హాసన్‌తో సైతం ‘థగ్ లైఫ్’ ద్వారా 36 ఏళ్ల తర్వాత మణిరత్నం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.

News October 6, 2024

ఆంధ్రుల హక్కు ముఖ్యమా.. పొత్తు ముఖ్యమా?: షర్మిల

image

AP: సీఎం చంద్రబాబుకు ఆంధ్రుల హక్కులు ముఖ్యమా, లేదంటే బీజేపీతో పొత్తు ముఖ్యమా అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై మోదీ, అమిత్ షాను నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కంటే పొత్తు ప్రయోజనాలు అంత ముఖ్యమేమీ కాదు’ అని ఆమె పేర్కొన్నారు.

News October 6, 2024

సీఎం రేవంత్ లేఖలో పొరపాటు.. BRS సెటైర్లు

image

TG: CM రేవంత్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై BRS సెటైర్లు వేస్తోంది. అందులో నేటి తేది(06.10.2024)కి బదులుగా (07.10.2024) పేర్కొనడం ఇందుకు కారణం. దీంతో పాటు ఆగస్టు 15 వరకు రూ.17,869.22 కోట్లు రుణమాఫీ చేశామని ఈరోజు సీఎం లేఖలో చెప్పగా ఆగస్టు 15న చేసిన ట్వీట్‌లో మాత్రం రూ.31,000 కోట్లు మాఫీ చేశామని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్స్ చేస్తున్నాయి.