News October 6, 2024

రజినీ-మణిరత్నం కాంబోలో సినిమా?

image

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నం కలిసి చివరిగా 1991లో ‘దళపతి’కి పనిచేశారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 12న రజినీ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావొచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కమల్ హాసన్‌తో సైతం ‘థగ్ లైఫ్’ ద్వారా 36 ఏళ్ల తర్వాత మణిరత్నం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 3, 2024

PUSHPA-2: మిగిలింది సాంగ్ ఒక్కటే!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప-2’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ముగింపు దశకు చేరుకుందని, కేవలం స్పెషల్ సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో శ్రద్ధా కపూర్‌తో పాటు శ్రీలీల కూడా కనిపించనున్నారని, ఈ వారంలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం.

News November 3, 2024

టర్నింగ్ పిచ్‌లే మనకు శత్రువులు: హర్భజన్

image

భారత్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ టీమ్‌ను మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభినందించారు. భారత జట్టుకు టర్నింగ్ పిచ్‌లే శత్రువులుగా మారుతున్నాయని అన్నారు. ‘టీమ్‌ఇండియా మెరుగైన పిచ్‌లపై ఆడాలని చాలా ఏళ్ల నుంచి చెబుతున్నా. ఈ టర్నింగ్ పిచ్‌లు ప్రతి బ్యాటర్‌ను చాలా సాధారణంగా కనిపించేలా చేస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.

News November 3, 2024

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యంపై బిహార్‌లో చ‌ర్చ‌

image

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్రకటనను బిహార్ బీజేపీ నేత‌లు స్వాగ‌తించారు. బిహార్‌లో కూడా ఈ త‌రహా వింగ్ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి నీర‌జ్ బాబు పేర్కొన్నారు. అయితే ఇది క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌ల‌ దృష్టి మ‌ర‌ల్చడానికి చేస్తున్న ప్ర‌యత్నాల‌ని, వీరంద‌రూ న‌కిలీ సనాతనీయులని RJD నేత మృత్యుంజ‌య్ తివారీ విమ‌ర్శించారు.