News April 24, 2024

సీఎం జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్

image

AP: CM జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. 21వ రోజు యాత్రలో భాగంగా ఎంవీవీ సిటీ నుంచి రేపు ఉ.9 గంటలకు బయల్దేరి మధురవాడ, ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో CM భేటీ అవుతారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ, బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం, అక్కివలస చేరుకుంటారు.

Similar News

News November 8, 2025

TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కొండల్ రెడ్డి

image

తెలంగాణ గణిత ఫోరం మెదక్ జిల్లా నూతన శాఖ ఏర్పడింది. TMF మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బి .కొండల్ రెడ్డి (జడ్పీహెచ్ఎస్ కూచన్‌పల్లి పాఠశాల), ప్రధాన కార్యదర్శిగా గోపాల్ (జడ్పిహెచ్ఎస్ ఝాన్సీ లింగాపూర్), కోశాధికారిగా శివ్వ నాగరాజు (శంకరంపేట(R)), ఉపాధ్యక్షుడిగా బాలరాజు (జడ్పీహెచ్ఎస్ కుర్తివాడ) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గౌరవ అధ్యక్షుడు సదన్ కుమార్ తెలిపారు.

News November 8, 2025

ఇజ్రాయెల్ PM అరెస్టుకు తుర్కియే వారెంట్

image

గాజాలో విధ్వంసం, నరమేధానికి కారణమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్ జారీచేసింది. ఆయనతో పాటు మంత్రులు కట్జ్, ఇతమాన్ బెన్ గ్విర్, ఇతర అధికారులతో మొత్తం 37 మందిని వారెంటులో చేర్చినట్లు ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. తుర్కియే నిరంకుశ పాలకుడు ఎర్డోగన్ ప్రజలను మభ్యపెట్టే స్టంట్ ఇది అని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విమర్శించారు.

News November 8, 2025

పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ఆంధ్ర యూనివర్సిటీలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌ 6 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డెమోగ్రఫి, పాపులేషన్ స్టడీస్, స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, ఆంత్రోపాలజీలో మాస్టర్ డిగ్రీ, M.Phil, PhDతో పాటు SET/SLET/NET అర్హత సాధించి ఉండాలి. వెబ్‌సైట్: https://www.andhrauniversity.edu.in/