News April 16, 2024
CM జగన్ నేటి బస్సు యాత్ర షెడ్యూల్
AP: జగన్ చేపట్టిన బస్సు యాత్ర 16వ రోజైన నేటి షెడ్యూల్‌ను YCP విడుదల చేసింది. నిన్న బస చేసిన నారాయణపురం నుంచి బయల్దేరనున్న CM.. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం బయల్దేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజీ వద్ద జరిగే సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి శిబిరానికి చేరుకుంటారు.
Similar News
News November 17, 2024
మణిపుర్‌లో బీజేపీకి NPP మద్దతు ఉపసంహరణ
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలోని బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది. 60 స్థానాలున్న మణిపుర్‌లో బీజేపీకి 32, NPPకి 7 సీట్లు ఉన్నాయి. మొత్తంగా NDAలోని పార్టీలకు 53 స్థానాలు ఉండగా, NPP సపోర్ట్ ఉపసంహరించుకోవడంతో బలం 46 స్థానాలకు పడిపోతుంది. ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదు.
News November 17, 2024
పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా జావేద్.. గిలెస్పీ ఔట్?
పాకిస్థాన్ హెడ్ కోచ్ జాసన్ గిలెస్పీకి పీసీబీ ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. నూతన కోచ్‌గా పాక్ మాజీ క్రికెటర్ అకీబ్ జావేద్‌ను నియమిస్తారని సమాచారం. అన్ని ఫార్మాట్లకు ఆయనే హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. రేపు దీనిపై పీసీబీ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా పీసీబీ ఇటీవలే గిలెస్పీని హెడ్ కోచ్‌గా నియమించింది. ఇంతలోనే ఆయనపై వేటు వేసింది.
News November 17, 2024
‘తగ్గేదే లే’ సిగ్నేచర్ మూమెంట్‌తో క్రికెటర్లు
‘పుష్ప’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మేనరిజం, ఆటిట్యూడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పాటు క్రికెటర్లూ ఫిదా అయ్యారు. ఈక్రమంలో వివిధ మ్యాచుల్లో వారంతా తగ్గేదే లే స్టెప్పులేశారు. తాజాగా ‘పుష్ప-2’ ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో ఆ సన్నివేశాలను అభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వారిలో కోహ్లీ, వార్నర్, జడేజా, రబాడా, రషీద్ ఖాన్, SRH ప్లేయర్లు, IND ఉమెన్ ప్లేయర్లు ఉన్నారు.