News November 17, 2024

మణిపుర్‌లో బీజేపీకి NPP మద్దతు ఉపసంహరణ

image

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలోని బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది. 60 స్థానాలున్న మణిపుర్‌లో బీజేపీకి 32, NPPకి 7 సీట్లు ఉన్నాయి. మొత్తంగా NDAలోని పార్టీలకు 53 స్థానాలు ఉండగా, NPP సపోర్ట్ ఉపసంహరించుకోవడంతో బలం 46 స్థానాలకు పడిపోతుంది. ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదు.

Similar News

News December 11, 2024

మార్చి 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్!

image

AP: వచ్చే ఏడాది మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. దీనికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతి లభించగానే పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మార్చి 1 నుంచి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి.

News December 11, 2024

నాగబాబుకు మంత్రి పదవి.. ఇచ్చేది ఈ శాఖేనా?

image

AP: మంత్రివర్గంలో చేరబోతున్న నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కావడంతో టూరిజంతోపాటు కందుల దుర్గేశ్ వద్ద ఉన్న ఈ శాఖ బదిలీ సులభం అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నాగబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గనుల శాఖ ఇస్తారనే ప్రచారమూ ఉంది.

News December 11, 2024

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు, రేపు వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. CM చంద్రబాబు అధ్యక్షత వహించనున్న ఈ సదస్సులో స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న రోజుల్లో అందించే పాలన, తదితరాలపై దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సు ఉదయం 10.30గంటలకు ప్రారంభమై సాయంత్రం 7.30 వరకు కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓసారి సదస్సు నిర్వహించగా, ఇది రెండోది.