News May 10, 2024
షర్మిలపై సీఎం జగన్ పరోక్ష విమర్శలు

AP: నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. రాజకీయంగా YSR కుటుంబాన్ని అణగదొక్కాలని అన్ని వ్యవస్థలను ప్రయోగించిన INC, TDPతో కలిసిపోయిన వాళ్లు వైఎస్సార్ వారసులా? అని షర్మిల టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. తనను 16 నెలలు అన్యాయంగా జైలులో పెట్టారని, ఆ కాలాన్ని ఎవరు తిరిగిస్తారంటూ ఫైరయ్యారు.
Similar News
News April 3, 2026
రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ల పునర్విభజన

AP: రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల పునర్విభజనకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ జరిగింది. ఈ మార్పులతో వార్డుల సంఖ్య విశాఖలో 98 నుంచి 120కి, విజయవాడలో 64 నుంచి 86కు, గుంటూరులో 57 నుంచి 76కు, నెల్లూరులో 54 నుంచి 72కి, కర్నూల్‌లో 52 నుంచి 68కి, తిరుపతిలో 50 నుంచి 66కు, అనంతపురంలో 50 నుంచి 62కు పెరిగాయి.
News April 3, 2026
1,89,819 అక్షరాలతో పదం ఉందని తెలుసా?

Pneumonoultramicroscopicsilicovolcanoconiosis (45 అక్షరాలు) అనేది ఇంగ్లిష్‌లో అత్యంత పొడవైన పదం. అగ్నిపర్వత ధూళి వల్ల వచ్చే వ్యాధి ఇది. అయితే టిన్‌టిన్ అనే ప్రొటీన్ కెమికల్ నేమ్ ఏకంగా 1,89,819 అక్షరాలు ఉంది. Methionylthreonyl.. అంటూ సాగే దీనిని పలకడానికే 2-3hrs పడుతుంది. ఇది 34,350 రకాల ఆమ్లాల గురించి వివరిస్తుంది. దీనిని పదంగా పరిగణించడంపై భిన్నాభిప్రాయాలు ఉండటంతో డిక్షనరీల్లో చోటు దక్కలేదు.
News April 3, 2026
₹167కోట్లు!.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్

రాజా రవివర్మ పెయింటింగ్స్‌లో ఒకటైన ‘యశోద-కృష్ణ’ వేలంలో ఏకంగా ₹167.20కోట్లు పలికింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. ఎంఎఫ్ హుసేన్ ‘గ్రామ్ యాత్ర’ పెయింటింగ్ రికార్డ్‌ను (₹118Cr) బ్రేక్ చేసి దేశంలోనే ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఈ ఆయిల్ పెయింటింగ్‌ను రవివర్మ 1890ల్లో గీశారు. యశోద ఆవు పాలు పితుకుతుంటే బాలకృష్ణుడు పాత్రతో చేయిచాస్తున్నట్టుగా ఈ చిత్రం ఉంది.


