News March 30, 2025
కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం

TG: రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందజేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. దీంతో 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. 10 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు.
Similar News
News April 1, 2025
దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయంటే?

దోమలు అందరిపై ఒకేలా దాడి చేయవు. ఎందుకంటే వాటికీ ఓ టేస్ట్ ఉంది. దోమలు ‘O’ గ్రూప్ రక్తాన్ని ఎక్కువగా ఇష్టపడతాయని ఓ పరిశోధనలో తేలింది. అందుకే O గ్రూప్ వ్యక్తులను ఎక్కువగా, A రకం వాళ్లని తక్కువగా కుడతాయి. అలాగే, చర్మంపై ఉండే బ్యాక్టీరియా కూడా కీలకం. అవి చెమటతో కలిసినప్పుడు విడుదల చేసే వాసన దోమలను ఆకర్షించడమో, తిప్పికొట్టడమో చేస్తుంటాయి. గర్భిణులు, వ్యాయామం చేసే వారిపై దోమల ప్రభావం ఎక్కువ అని తేలింది.
News April 1, 2025
400 ఎకరాలను న్యాయపరంగానే తీసుకుంటున్నాం: భట్టి

TG: HCU భూములను ప్రభుత్వం లాక్కుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని Dy.CM భట్టి విక్రమార్క ఖండించారు. విద్యార్థులు రాజకీయ ప్రభావానికి లోను కావొద్దని సూచించారు. ‘2004లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాలను HCUకి మరో చోట కేటాయించింది. ఈ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నాం. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి’ అని సూచించారు.
News April 1, 2025
ALERT.. రేపటి నుంచి వర్షాలు

తెలంగాణలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుందని పేర్కొంది. దీంతో పాటు గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.