News January 10, 2025
నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం.. కీలక అంశాలపై చర్చ
TG: సీఎం రేవంత్ ఇవాళ మ.3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై చర్చించనున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా పంపిణీని ప్రారంభిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 25, 2025
VSR రాజీనామా వైసీపీకి నష్టమా?
AP: విజయసాయిరెడ్డి రాజీనామా YCPకి నష్టం కంటే పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు ఎమోషనల్‌గా కష్టమైన విషయం. YCP ఆవిర్భావం నుంచి ఉన్న నలుగురైదుగురిలో ఒకరైన ఆయనే పార్టీని వీడటం మనో ధైర్యం కోల్పోయే విషయం. లక్షల ఓట్లను ప్రభావితం చేసే మాస్ లీడర్ కాదు కాబట్టి YCP ఓటు బ్యాంకుకు నష్టమేం లేదు. కాకపోతే YS కుటుంబంతో 3 తరాల అనుబంధం ఉన్న వ్యక్తి, జగన్‌కు అన్నీ తానైన VSR పార్టీని వీడటం YCPని చాలా బాధపెట్టే విషయం.
News January 25, 2025
ICC మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అర్ష్‌దీప్
ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2024 అవార్డుకు భారత బౌలర్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ICC ప్రకటించింది. 25 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ బౌలర్ టీ20ల్లో భారత తరఫున అత్యధిక వికెట్లు(97) తీసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నారు. 2024లో ఆడిన 18 మ్యాచుల్లో 36 వికెట్లు తీశారు. గత ఏడాది భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో అర్ష్‌దీప్ కీలక పాత్ర పోషించారు.
News January 25, 2025
సోనూసూద్ ఫౌండేషన్‌కు FCRA లైసెన్స్ మంజూరు
సోనూసూద్ ‘సూద్ చారిటీ ఫౌండేషన్’కు కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్సును మంజూరు చేసింది. ఈ లైసెన్సు పొందిన NGOలు ఐదేళ్ల పాటు విదేశీ నిధులను స్వీకరించవచ్చు, వాడుకోవచ్చు. సామాజిక సేవ చేయడం, అన్ని వర్గాల ప్రజలకు అత్యాధునిక వనరులు, సాయం అందాలనేదే తమ లక్ష్యమని సూద్ ఫౌండేషన్ పేర్కొంది. కొవిడ్ టైంలో సోనూసూద్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.