News March 6, 2025
విద్యకు దూరమైన బాలిక.. స్పందించిన సీఎం

TG: బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదంటూ HYD సనత్‌నగర్‌కు చెందిన శ్రీవిద్య(8)ను స్కూలులో చేర్చుకోలేదన్న వార్తపై CM రేవంత్ స్పందించారు. ‘శ్రీవిద్య సమస్య నా దృష్టికి వచ్చింది. ఆమె పాఠశాలకు వెళ్లకపోవడానికి ఆధార్ లేకపోవడం కారణం కాదని విచారణలో తేలింది. కుటుంబ కారణాల వల్లే ఆమె స్కూలుకు దూరమైంది. అధికారులు ఆమెను తిరిగి స్కూలులో చేర్పించారు. తను మంచిగా చదివి భవిష్యత్తులో గొప్పగా రాణించాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 9, 2026
‘ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే మెరుగైన జీవనం’

ప్రారంభదశలో క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స తీసుకుంటే మెరుగైన జీవనం పొందవచ్చని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వస్థ్ మహిళా-స్వస్థ్ భారత్ ప్రోగ్రాంలో ఆయన అదనపు కలెక్టర్లతో పాల్గొన్నారు. క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించి చికిత్స పొంది బతికినప్పటికీ లైఫ్ స్టైల్‌లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. మహిళా ఉద్యోగులకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు.
News February 9, 2026
‘సావర్కర్‌కు భారతరత్న’పై మాటల మంటలు

వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న RSS చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్స్‌తో మరోసారి చర్చ మొదలైంది. అసలు ఆయన దేశానికి ఏం సేవ చేశారని ఆ బిరుదు ఇవ్వాలని కాంగ్రెస్, MIM ఘాటుగా ప్రశ్నించాయి. అటు భారతరత్న కంటే సావర్కర్‌ది ఎంతో పెద్ద స్థాయి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్ చేశారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
News February 9, 2026
పిల్లల SM వాడకంపై నియంత్రణకు ప్రణాళికలు: CBN

AP: పిల్లలకు సోషల్ మీడియా నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు CM చంద్రబాబు తెలిపారు. మంత్రులు, కార్యదర్శులు, శాంతి భద్రతలపై DGP, SPలతో సమావేశమయ్యారు. ’16 ఏళ్లలోపు పిల్లలు SM వాడకాన్ని నియంత్రించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలి. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన వారిని మార్చేలా చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలి’ అని సూచించారు.


