News June 1, 2024

కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

image

TG: రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కేసీఆర్‌కు <<13357281>>గౌరవం<<>> లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘అమరవీరుల విషయంలో కమిటీ వేసి న్యాయం చేస్తాం. అమరులను గుర్తించేందుకు సమాచారం తెప్పిస్తున్నాం. వాళ్ల ఆనవాళ్లంటే కేసీఆర్‌కు ఎందుకంత ద్వేషం?’ అని ప్రశ్నించారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని వెల్లడించారు.

Similar News

News September 10, 2024

మీ స్మార్ట్‌ఫోన్ రేడియేషన్ తెలుసుకోండిలా..!

image

మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ వెలువడుతుందన్న సంగతి తెలిసిందే. అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. దీన్ని స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్(SAR) ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని ఫోన్ కొన్నప్పుడు ఇచ్చే యూజర్ మాన్యువల్ లేదా ఆ సంస్థ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. లేదంటే మీ ఫోన్లో *#07# డయల్ చేసినా ఆ వివరాల్ని తెలుసుకోవచ్చు.

News September 10, 2024

మలయాళ సినిమాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు థాంక్స్

image

అల్లు అర్జున్‌కు కేరళలోనూ భారీగా అభిమానులున్న విషయం తెలిసిందే. అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్లూ ఉన్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’ మూవీ ఎండ్‌కార్డులో ‘ఆల్ కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్& వెల్ఫేర్ అసోసియేషన్‌’కు మేకర్స్ థాంక్స్ చెప్పారు. హీరోకు ధన్యవాదాలు చెప్పడం కామన్ అని, అభిమానులకూ చెప్పడం bhAAi రేంజ్‌కు నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News September 10, 2024

రంజీ ట్రోఫీ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

image

భారత దేశవాళీ క్రికెట్ అంటే మొదటగా గుర్తొచ్చేది రంజీ ట్రోఫీనే. అలనాటి భారత క్రికెటర్ రంజిత్ సింగ్ పేరు మీదుగా టోర్నీకి రంజీ పేరు పెట్టారు. 1872, సెప్టెంబరు 10న రైతు కుటుంబంలో జన్మించిన రంజిత్ యాషెస్‌లో ఇంగ్లండ్ తరఫున ఆస్ట్రేలియాపై ఆడారు. భారత్‌కు క్రికెట్‌ను పరిచయం చేసింది ఆయనే. రంజిత్ ఆటను చూసి, క్రికెట్‌ను కనిపెట్టిన బ్రిటిషర్లు సైతం ముగ్ధులయ్యేవారని చెబుతారు. నేడు రంజిత్ సింగ్ జయంతి.