News May 25, 2024
నేడో, రేపో ఢిల్లీకి సీఎం రేవంత్?

TG: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ అగ్ర నేత సోనియాగాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడో, రేపో ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంతో పాటు కొందరు మంత్రులు కూడా హస్తినకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని కూడా ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఆవిర్భావ వేడుకల్లో సోనియాను సన్మానించాలని కేబినెట్ ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 7, 2025
బంగ్లాదేశ్ నటిపై దేశద్రోహం కేసు

బంగ్లాలో మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై విమర్శలు చేసిన నటి మెహెర్ ఆఫ్రోజ్‌పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. జమాల్‌పూర్‌లోని ఆమె ఇంటిపై దుండగులు దాడి చేసి నిప్పు పెట్టడం గమనార్హం. బహిష్కృత నేత హసీనాకు చెందిన ఆవామీ లీగ్‌లో ఆఫ్రోజ్ తండ్రి సభ్యుడిగా ఉన్నారు. ఆమె తల్లి అదే పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీగా పనిచేశారు.
News February 7, 2025
గురుకులాల్లో ప్రవేశాలు.. ముగిసిన దరఖాస్తు గడువు

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. 643 గురుకులాల్లో మొత్తం 51,968 సీట్లు ఉండగా, 1.67లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఐదో తరగతికే 88,824 అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనుండగా, మే 15 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి జూన్ 12 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.
News February 7, 2025
ఈ నెల 14న రాష్ట్ర బంద్: మాల మహానాడు

TG: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు ప్రకటించాయి. మాలలను అణచివేసేందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, MRPS నేత మందకృష్ణ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డాయి.