News July 8, 2024

నేడు విజయవాడకు సీఎం రేవంత్, మంత్రులు

image

TG: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75వ జయంతి సభకు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 25, 2025

‘ఛాంపియన్’ మూవీ రివ్యూ&రేటింగ్

image

ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా నిలవాలనుకునే హీరో బైరాన్‌పల్లి స్వాతంత్ర్య ఉద్యమంలో ఎలా చిక్కుకున్నాడు? చివరికి ఆ హీరో కల నెరవేరి ఛాంపియన్ అయ్యాడా లేదా అనేదే మూవీ కథ. హీరోహీరోయిన్లు రోషన్, అనస్వర నటన మెప్పిస్తుంది. సాంకేతికంగా బాగుంది. చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి యాసతో మెప్పించలేకపోయారు. కొన్ని సీన్లు అనవసరం అనిపిస్తాయి. ఎమోషన్ సరిగ్గా పండలేదు.
రేటింగ్: 2.5/5

News December 25, 2025

నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్లో పూత, పిందె రాలకుండా ఉండాలంటే..

image

నిమ్మ, నారింజ, బత్తాయి తోటల్లో నత్రజని, భాస్వరంతో పాటు పొటాష్‌ కూడా ముఖ్యం. ఇది ఆకుల్లో తయారైన పిండిపదార్థాలు, మాంసకృత్తుల రవాణాకు అవసరమైన ఎంజైములను ఉత్తేజపరిచి పూత, పిందెరాలడాన్ని తగ్గిస్తుంది. 1% పొటాషియం నైట్రేట్‌ను బఠాణి గింజ పరిమాణంలో పిందెలు ఉన్న బత్తాయి చెట్టుపై పిచికారీ చేస్తే పిందె రాలడం తగ్గి, పండు పరిమాణంతో పాటు రసం శాతం, రసంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి చక్కెరల శాతం కూడా పెరుగుతుంది.

News December 25, 2025

HUDCOలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఢిల్లీలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>HUDCO<<>>) 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/బీటెక్/ప్లానింగ్, MBA, PhD, CA, CMA, PG( అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ పాలసీ, అర్బన్ గవర్నెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.hudco.org.in/