News June 25, 2024
ముగ్గురు కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ విన్నపాలు

HYDలో 2450 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్రానికి బదిలీ చేస్తే రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాజ్నాథ్ సింగ్కు CM రేవంత్ విన్నవించారు. TGకి 2.70లక్షల ఇళ్లను మంజూరు చేయాలని మనోహర్లాల్ ఖట్టర్ను కోరారు. PMAY(U) కింద గ్రాంటుగా రూ.78,488 కోట్ల బకాయిలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ కింద TGకి రావాల్సిన రూ.693.13 కోట్లు విడుదల చేయాలని JP నడ్డాకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 21, 2025
సుప్రీం ఆదేశాలు పట్టించుకోవట్లేదు: రాజ్దీప్

ఢిల్లీలో దీపావళి రోజున రాత్రి 8-10 గంటల మధ్య బాణసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే 11pm దాటినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా టపాసులు కాలుస్తున్నారని ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. SC ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యానికి ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు కూడా వాస్తవాన్ని పరిశీలించాలని కోరారు.
News October 21, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 21, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 21, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.