News March 21, 2025
మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ అభినందనలు

TG: UKలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని CM రేవంత్ అభినందించారు. ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు చిరంజీవిగారికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగుజాతికి గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్ఠలను విశ్వవేదికపై చాటిచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 21, 2025
వారి నవ్వు చూసి నాకు సంతోషం కలిగింది: నాగబాబు

AP: శాసనసభ కల్చరల్ ఈవెంట్‌లో CM చంద్రబాబు, Dy.CM పవన్ నవ్వడం చూసి తనకు సంతోషం వేసిందని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ‘ఆ రోజు అసెంబ్లీలో గౌరవనీయులైన చంద్రబాబుకు జరిగిన అవమానానికి ఆయన కన్నీరు పెట్టడం ఎంతో బాధించింది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా నవ్వుతున్న దృశ్యం ఆహ్లాదంగా అనిపించింది. పని ఒత్తిడిలో పవన్ కూడా నవ్వడం చూసి సంతోషం వేసింది’ అని ట్వీట్ చేశారు.
News March 21, 2025
తెలుగు కామెంటేటర్స్ సిద్ధం.. మీ ఫేవరెట్ ఎవరు?

స్టేడియంలో ప్లేయర్లు తమ ఆటతో అలరిస్తే, కామెంటేటర్లు తమ మాటలతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటరీ ప్యానల్‌ను సిద్ధం చేసింది. గతంలో ‘ఉప్పల్‌లో కొడితే.. తుప్పల్లో పడింది’ అనే డైలాగ్ తెగ వైరలైంది. ఈ ప్యానల్‌లో రాయుడు, MSK ప్రసాద్, శ్రీధర్, హనుమ విహారి, సుమన్, ఆశిశ్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణ, అక్షత్ రెడ్డి, శశి, కళ్యాణ్, కౌశిక్, హేమంత్, నందు ఉన్నారు.
News March 21, 2025
VIRAL: ప్లీజ్.. ఇది OYO కాదు.. క్యాబ్!!

బెంగళూరులో ఓ డ్రైవర్ తన క్యాబ్‌లో పెట్టిన పోస్టర్ వైరల్ అవుతోంది. ‘హెచ్చరిక.. రొమాన్స్‌కు అనుమతి లేదు. ఇది క్యాబ్, ఓయో కాదు..’ అని అతడు రాసుకొచ్చాడు. దీంతో తన క్యాబ్‌లో ఎన్నిసార్లు జంటల పనులతో విసిగి ఇలా చేశాడో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.