News March 21, 2025
మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ అభినందనలు

TG: UKలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని CM రేవంత్ అభినందించారు. ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు చిరంజీవిగారికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగుజాతికి గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్ఠలను విశ్వవేదికపై చాటిచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 24, 2025
ఓటముల్లో SRH సెంచరీ

SRH ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. IPL హిస్టరీలో 100 ఓటములను ఎదుర్కొన్న ఏడో టీమ్‌గా నిలిచింది. తొలి ఆరు స్థానాల్లో ఢిల్లీ(137), పంజాబ్(137), ఆర్సీబీ(132), KKR(125), ముంబై(121), రాజస్థాన్(113), CSK(105) ఉన్నాయి. SRHకు ముందు 2008-12 మధ్య హైదరాబాద్ వేదికగా ఉన్న డెక్కన్ ఛార్జర్స్ 75 మ్యాచ్‌లలో 46సార్లు ఓడిపోయింది.
News April 24, 2025
మే 20న అంగన్వాడీల సమ్మె

AP: వేతనాల పెంపుతో పాటు వేసవి సెలవులు, సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మే 20న రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. లబ్ధిదారులకు అందించే సరుకులన్నీ విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని, ఫేస్ యాప్ ఇన్, ఔట్ లొకేషన్ తొలగించాలని వారు కోరుతున్నారు.
News April 24, 2025
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ?

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ డైరెక్షన్‌లో ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తారని తెలుస్తోంది. ఇది మహిళలపై అణచివేత, సామాజిక సమస్యలే కథాంశంగా రూపొందుతుందని టాక్. జులైలో షూటింగ్ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.