News June 27, 2024
సీఎం రేవంత్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్

సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని KTR అన్నారు. కేంద్రంతో CM రేవంత్ కుమ్మక్కై BJPకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి పరిధిలోని పార్టీ నేతలు, బొగ్గు గని కార్మిక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ‘సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News April 6, 2026
యుద్ధం.. పెరిగిన బిట్‌కాయిన్ ధర

పశ్చిమాసియాలో యుద్ధం విరమణకు ప్రయత్నాలు జరుగుతుండటంతో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్చి 25 తర్వాత తొలిసారి బిట్‌కాయిన్ ధర $70,000 మార్కును దాటింది. తర్వాత కొద్దిగా ఒడుదొడుకులకు లోనై ప్రస్తుతం $69,588 వద్ద ట్రేడవుతోంది. గతేడాది అక్టోబర్‌లో ఏకంగా $1,26,272కు చేరిన బిట్‌కాయిన్ ధర ఈ ఏడాది <<19063478>>ఫిబ్రవరిలో<<>> $60,033కు పడిపోయిన విషయం తెలిసిందే.
News April 6, 2026
భూమి నుంచి 4,06,773KM.. ఆర్టెమిస్-2 సరికొత్త చరిత్ర

నాసా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ స్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. భూమి నుంచి 4,06,773KM దూరానికి చేరుకొని అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్రగా నిలిచింది. 1970లో అపోలో-13 మిషన్ కంటే 2,500KM+ అధిక దూరం ప్రయాణించడం విశేషం. మరికొన్ని గంటల్లో వ్యోమగాములు చంద్రుడి సమీపానికి చేరుకొని చుట్టూ పరిభ్రమించనున్నారు.
News April 6, 2026
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం కుమారుడికి జీవితఖైదు

హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ చీఫ్ అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు జీవిత ఖైదు విధించింది. గతంలో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. 2003, జూన్ 4న NCP నాయకుడు విద్యాచరణ్ శుక్లా సన్నిహితుడైన రామావతార్ జగ్గీని పట్టపగలు కాల్చి చంపారు. ఈ కేసులో అమిత్ సహా 31 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత పలువురికి కోర్టులో ఊరట లభించింది.


