News June 27, 2024

సీఎం రేవంత్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్

image

సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని KTR అన్నారు. కేంద్రంతో CM రేవంత్ కుమ్మక్కై BJPకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి పరిధిలోని పార్టీ నేతలు, బొగ్గు గని కార్మిక నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ‘సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News February 14, 2025

వచ్చేవారం భారత్-బంగ్లా ‘సరిహద్దు’ చర్చలు

image

సరిహద్దు సమస్యలపై భారత్-బంగ్లాదేశ్ ఈ నెల 17-20 తేదీల మధ్యలో చర్చలు నిర్వహించనున్నాయి. సరిహద్దుల్లో కంచె నిర్మాణం, BSF జవాన్లపై బంగ్లా దుండగుల దాడి వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని BSF ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఇరు దేశాల మధ్య ఇదే తొలి అగ్రస్థాయి సమావేశం.

News February 14, 2025

రూ.7.5 కోట్ల జీతం.. అయినా జీవితం శూన్యం: టెకీ ఆవేదన

image

వారానికి 70, 90hr పనిచేయాలంటూ కంపెనీల దిగ్గజాలు ఉచిత సలహాలిస్తున్న వేళ ఓ టెకీ ఆవేదన ఆలోచింపజేస్తోంది. తాను రోజూ 14hr పనిచేస్తూ ₹7.5Cr జీతం తీసుకుంటున్నా మ్యారేజ్ లైఫ్ విషాదాంతమైందన్నారు. ‘కూతురు పుట్టినప్పుడు నేను మీటింగ్‌లో ఉన్నా. డిప్రెషన్‌లో ఉన్న భార్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేకపోయా. ఇప్పుడు ఆమె డివోర్స్ కోరుతోంది. కెరీర్‌లో ఎంతో సాధించినా జీవితం శూన్యంగా అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.

News February 14, 2025

ఒడిశా హైకోర్టులో ‘పద్మశ్రీ’ పంచాయితీ!

image

ఒడిశా హైకోర్టుకి ఓ వింత పంచాయితీ చేరింది. అంతర్యామి మిశ్రా అనే పేరున్న వ్యక్తికి 2023లో సాహిత్య విభాగంలో కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆ పేరు కలిగిన జర్నలిస్టు ఢిల్లీ వెళ్లి పురస్కారం స్వీకరించారు. అయితే, అది తనకు ప్రకటిస్తే వేరే వ్యక్తి తీసుకున్నారని అదే పేరు కలిగిన వైద్యుడు హైకోర్టుకెక్కారు. దీంతో వారిద్దరినీ వారి వారి రుజువులతో తదుపరి విచారణకు కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

error: Content is protected !!