News February 15, 2025

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులు, MLA కోటా MLC పదవులు సహా మరికొన్ని అంశాలపై ఆయనతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం.

Similar News

News March 25, 2025

ముస్లిములకు BJP రంజాన్ గిఫ్ట్: 32లక్షల కిట్స్ రెడీ

image

రంజాన్ సందర్భంగా BJP మైనారిటీ మోర్చా ‘సౌగాత్ ఈ మోదీ’ క్యాంపెయిన్ ఆరంభిస్తోంది. దేశవ్యాప్తంగా 32లక్షల పేద ముస్లిములకు పండగ కిట్లను అందించనుంది. అర్హులైన వారికి ఇవి చేరేందుకు 32వేల మోర్చా కార్యకర్తలు 32వేల మసీదులతో సమన్వయం అవుతారు. BJP ప్రెసిడెంట్ JP నడ్డా రేపు ఢిల్లీలో కిట్ల పంపిణీని ఆరంభిస్తారు. వీటిలో పురుషులు, స్త్రీలకు వస్త్రాలు, సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువులు ఉంటాయి.

News March 25, 2025

టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ నా చేతుల్లో లేదు: సిరాజ్

image

టీమ్ ఇండియాలోకి తిరిగి ఎంపికవ్వడం తన చేతుల్లో లేదని ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అన్నారు. మెరుగైన ప్రదర్శన చేస్తూ వికెట్లు తీయడంపైనే తన దృష్టి ఉందని పేర్కొన్నారు. తన వంతుగా 100శాతం ప్రదర్శన చేస్తానని తెలిపారు. ఒకవేళ సెలక్షన్ గురించే ఆలోచిస్తే అది తన ఆటతీరుపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ బౌలర్‌ను CTకి పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్‌లో సిరాజ్ గుజరాత్ తరఫున ఆడుతున్నారు.

News March 25, 2025

బెట్టింగ్ యాప్స్.. టాలీవుడ్ స్టార్లకు బిగుస్తున్న ఉచ్చు

image

TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ‘జంగిల్ రమ్మి’ కోసం రానా, ప్రకాశ్ రాజ్, ‘ఏ23’కి విజయ్ దేవరకొండ, ‘యోలో 247’కి మంచు లక్ష్మి, ‘జీట్ విన్’కు నిధి అగర్వాల్, ‘ఫెయిర్ ప్లే లైవ్’ కోసం ప్రణీత ప్రచారం చేసినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలను సేకరించిన అనంతరం వీరిని విచారణకు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు.

error: Content is protected !!