News October 7, 2024
కేంద్ర మంత్రులతో CM రేవంత్ భేటీ

ఢిల్లీలో ఉన్న CM రేవంత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి పనులకు సహాకారం అందించాలని కోరారు. CSMPని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. HYDలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థ ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని వివరించారు.
Similar News
News December 8, 2025
గద్వాల: వలస ఓటర్లపై అభ్యర్థుల దృష్టి

గద్వాల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో అభ్యర్థులు దృష్టి వలస ఓటర్లపై పడింది గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోసం.. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి నగరాలకు వలస వెళ్లారు. అయినప్పటికీ వారి ఓటు మాత్రం గ్రామాల్లోనే ఉంది. వారికి ఫోన్ చేసి గ్రామాలకు రప్పించేందుకు అభ్యర్థులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
News December 8, 2025
వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 8, 2025
మావోయిస్టు కీలక నేత లొంగుబాటు.. MMCలో ఉద్యమం అంతం!

మావోయిస్టు పార్టీ కీలక నేత రామ్‌ధేర్ మజ్జీ సహా 12 మంది ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్‌ధేర్ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) జోన్లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతడిపై రూ.3 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. రామ్‌ధేర్ లొంగుబాటుతో MMC జోన్లో మావోయిజం అంతమైనట్లేనని భావిస్తున్నారు.


