News October 7, 2024
కేంద్ర మంత్రులతో CM రేవంత్ భేటీ
ఢిల్లీలో ఉన్న CM రేవంత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి పనులకు సహాకారం అందించాలని కోరారు. CSMPని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. HYDలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థ ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని వివరించారు.
Similar News
News November 10, 2024
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సమావేశాల తొలిరోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే ముందు సీఎం కార్యాలయంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ వెంటనే సభను స్పీకర్ వాయిదా వేస్తారు. ఈ సమావేశాలు 11న ప్రారంభమై 11రోజులు కొనసాగే అవకాశం ఉంది.
News November 10, 2024
నేడు సౌతాఫ్రికాతో భారత్ రెండో టీ20
భారత్, సౌతాఫ్రికా మధ్య 4 టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు జరగనుంది. సెయింట్ పార్క్ వేదికగా రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది. కాగా తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా 61రన్స్ తేడాతో సఫారీ జట్టును మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 2-0తో సిరీస్‌పై పట్టుబిగించాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. అటు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ బరిలో నిలవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది.
News November 10, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ రద్దు
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి Nov 11న జరగాల్సిన ఒక కీలక ఈవెంట్‌ను ICC రద్దు చేసింది. ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఇదే ఈవెంట్ రద్దుకు కారణం. ఈ ఈవెంట్‌లో టోర్నీలో పాల్గొనే జట్ల జెండాలను ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. అయితే పాకిస్థాన్‌కు వెళ్లడం ససేమిరా కుదరదంటోంది భారత్.