News July 29, 2024

CM రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు: హరీశ్

image

TG: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి BRS అంగీకరించిందని CM రేవంత్ సభను తప్పుదోవ పట్టించారని MLA హరీశ్‌రావు అన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలోనూ రేవంత్ అబద్ధాలు చెప్పారన్నారు. అంతటితో ఆగకుండా అమరవీరులను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడగానే ఏదో ఓ కాగితం తెచ్చి సభను తప్పుదోవపట్టిస్తున్నారని, సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయాలని భావిస్తున్నామన్నారు.

Similar News

News October 7, 2024

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తాం: జగిత్యాల ఎస్పీ

image

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్‌ కుమార్ వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చిన అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

News October 7, 2024

దారుణం.. ప్రియుడి కోసం 13 మందిని చంపింది!

image

పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఓ యువతి తన పేరెంట్స్ సహా 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. పక్కా ప్లాన్ ప్రకారం ఆహారంలో విషం కలిపింది. అది తిన్న వెంటనే 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు యువతితో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

News October 7, 2024

2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనందరం చూస్తాం: పవన్

image

గుజరాత్ CMగా మోదీ ప్రమాణం చేసి నేటికి 23ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు AP Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘విప్లవాత్మక నిర్ణయాలతో కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడం ఆరోజు మొదలైంది. ఆయన నాయకత్వంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో దూసుకుపోతూ, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను మనం చూస్తామని నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు.