News April 22, 2025
హిరోషిమాలో అణుబాంబు మృతులకు CM రేవంత్ నివాళులు

తెలంగాణ CM రేవంత్ జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఇవాళ హిరోషిమా పీస్ మెమోరియల్ పార్కును సందర్శించి అణుబాంబు మృతులకు నివాళులు అర్పించారు. అలాగే, దాడి జరిగిన ప్రాంతంలో శాంతికి చిహ్నంగా ఏర్పాటు చేసిన డోమ్‌ను సైతం సందర్శించారు. CMతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, జపాన్ ప్రతినిధులు ఉన్నారు. 1945లో 2వ ప్రపంచ యుద్ధం వేళ జపాన్‌పై US అణుబాంబుతో దాడి చేసిన విషయం తెలిసిందే.
Similar News
News April 16, 2026
ఆనందపురంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఆనందపురంలోని ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ వాసునాయుడు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన ఎల్.తారకి రావు ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నాడు. బుధవారం వచ్చిన రిజల్ట్స్‌లో 441 మార్కులు సాధించిన తారకి రావును తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి హాస్టల్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
News April 16, 2026
యుద్ధం సెగ.. సబ్బుల ధరలకు రెక్కలు!

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతోంది. క్రూడాయిల్ ధరలు పెరగడం, సముద్ర మార్గాల్లో రవాణా అడ్డంకులు నిత్యావసరాల ధరలను పెంచేస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు భారమవ్వడంతో సబ్బులు, షాంపులు, సర్ఫ్‌లు సహా మరికొన్ని నిత్యావసర వస్తువుల రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే HUL తమ లిరిల్, పియర్స్, డవ్ వంటి బ్రాండ్లతో ఉన్న ప్రొడక్ట్స్ ధరలను ₹2-₹3 వరకు పెంచింది.
News April 16, 2026
మహిళా రిజర్వేషన్ల అమలుకు సమయం ఆసన్నమైంది: అర్జున్ మేఘ్వాల్

పార్లమెంటు చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. లోక్‌సభలో ఇవాళ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘2023లోనే నారీశక్తి వందన్ అధినియం బిల్లు ఆమోదం పొందింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయింపును పార్లమెంటు ఆమోదించింది. దీన్ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించారు.


