News February 2, 2025

బాలుడి ఆవిష్కరణకు సీఎం రేవంత్ ప్రశంస

image

TG: హైబ్రిడ్ సైకిల్‌ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగన్‌కు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్‌తో నడిచే సైకిల్‌ను రూపొందించాడు.

Similar News

News February 19, 2025

MUDA SCAM: సిద్దరామయ్యకు లోకాయుక్త క్లీన్‌చిట్

image

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఊరట దక్కింది. ‘ముడా’ ల్యాండ్ స్కామ్ కేసులో ఆయనకు లోకాయుక్త క్లీన్‌చిట్ ఇచ్చింది. భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతి తదితరులపై ఆరోపణలు వచ్చాయి. వీటికి ఎలాంటి ఆధారాల్లేవని తాజాగా లోకాయుక్త పోలీసులు వెల్లడించారు.

News February 19, 2025

పాకిస్థాన్‌లో రెపరెపలాడిన భారత జెండా

image

ఎట్టకేలకు పాకిస్థాన్‌లో భారత జెండా రెపరెపలాడింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అన్ని దేశాల పతాకాలు ఆతిథ్య దేశం స్టేడియాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ భారత మువ్వన్నెల పతాకాన్ని పాక్ క్రికెట్ బోర్డు విస్మరించింది. నిబంధనలు ఉల్లంఘించిన పాక్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగొచ్చిన పీసీబీ ఇండియన్ ఫ్లాగ్‌ను ఇవాళ కరాచీలోని స్టేడియంపై ఏర్పాటు చేసింది.

News February 19, 2025

జగన్‌కు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదు: షర్మిల

image

బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని AICC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీకి వెళ్లి పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం YS జగన్‌కు, YCP MLAలకు లేదని విమర్శించారు. ‘నేరస్థులను జైలుకెళ్లి పరామర్శించే సమయం ఉంటుంది కానీ.. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం మొహం చెల్లదు’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!