News August 23, 2024

ఢిల్లీకి సీఎం రేవంత్.. నేడు కీలక భేటీ!

image

TG: కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు CM రేవంత్ నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌తో సహా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఇవాళ వెళ్లనున్నారు. TPCC చీఫ్, క్యాబినెట్ విస్తరణపై అధిష్ఠానంతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో వీటిపై స్పష్టత రానున్నట్లు సమాచారం. PCC చీఫ్ రేసులో బలరాం నాయక్, మధుయాష్కీ, మహేశ్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ పేర్లు వినిపిస్తున్నాయి.

Similar News

News September 19, 2024

బాలికలపై లైంగిక వేధింపులు.. వార్డెన్ సస్పెండ్

image

AP: ఏలూరులోని ఓ ఆశ్రమ హాస్టల్‌లో బాలికలపై లైంగిక వేధింపులకు <<14129113>>పాల్పడిన<<>> గ్రేడ్-2 సంక్షేమాధికారి శశికుమార్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ఫిర్యాదుతో ప్రాథమిక దర్యాప్తు చేయించిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం శశికుమార్, అతడికి సహకరించిన వారిపై పోక్సో కేసు నమోదుచేస్తామని చెప్పారు.

News September 19, 2024

మద్యం షాపు దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు

image

AP: నూతన మద్యం పాలసీలో భాగంగా 3,736 లిక్కర్ షాప్‌లలో 10 శాతం(340) గీత కార్మికులకు రిజర్వ్ చేస్తారు. దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు. లాటరీ విధానంలో రెండేళ్ల కాలపరిమితితో షాపులు కేటాయిస్తారు. ఉ.10 నుంచి రా.10 వరకు షాపులకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజు రూ.50-85 లక్షలు చెల్లించాలి. 12 ప్రధాన పట్టణాల్లో 12 ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి అదనంగా ఫీజు నిర్ణయిస్తారు.

News September 19, 2024

T20I నంబర్-1 ఆల్‌రౌండర్‌గా లివింగ్‌స్టోన్

image

ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. 124 రన్స్, 5 వికెట్లు తీయడంతో 253 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత స్టొయినిస్(211), సికందర్ రజా(208), షకిబ్ అల్ హసన్(206), నబీ(205), హార్దిక్ పాండ్య(199) ఉన్నారు. T20I బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ట్రావిస్ హెడ్, బౌలింగ్‌లో అదిల్ రషీద్ టాప్‌లో ఉన్నారు.