News August 14, 2024
17న ఢిల్లీకి సీఎం రేవంత్!
TG: CM రేవంత్ రెడ్డి ఈనెల 17న ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. శ్రావణమాసంలో పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రేవంత్‌కు సూచించారు. దీంతో ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News September 11, 2024
ఈ క్రికెటర్ ఎవరో చెప్పుకోండి చూద్దాం!
క్రికెట్ ప్రేమికులకో పజిల్. పై ఫొటోలో ఓ లెజెండరీ బౌలర్ ఉన్నారు. వన్డేల్లో 300కి పైగా మెయిడిన్ ఓవర్లు వేసిన ఒకే ఒక క్రికెటర్ అతడు. వందకు పైగా టెస్టులు, 300కు పైగా వన్డేలు, 13 ఐపీఎల్ మ్యాచులు ఆడారు. IPLలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆ లెజెండరీ క్రికెటర్ ఎవరో కామెంట్ చేయండి.
**సరైన సమాధానం మ.ఒంటి గంటకు ఇదే ఆర్టికల్‌లో చూడండి.
News September 11, 2024
నాపై అత్యాచారం చేశాడు: IAF ఆఫీసర్‌పై మహిళ ఫిర్యాదు
వింగ్ కమాండర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఎయిర్‌ఫోర్స్ ఫ్లైయింగ్ అధికారిణి జమ్మూకశ్మీర్‌లోని బడ్గాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది బర్త్ డే పార్టీ పేరుతో తనను ఇంటికి పిలిచి లైంగిక దాడి చేశాడని తెలిపారు. అతడితో కలిసి విధులు నిర్వర్తించలేనని, తనను వేరే చోటకు బదిలీ చేయాలని కోరారు. కొద్ది రోజులుగా తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పారు.
News September 11, 2024
BAD LUCK: మూడో రోజూ ఆట రద్దు
గ్రేటర్ నోయిడాలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. ఇప్పటికే తొలి రెండు రోజుల ఆట రద్దవగా, వర్షం కారణంగా నేడు జరగాల్సిన ఆటను కూడా అంపైర్లు రద్దు చేశారు. ఈ విషయం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు ప్లేయర్లనూ నిరాశలోకి నెట్టింది. రేపైనా పరిస్థితులు అనుకూలించి మ్యాచ్ జరగాలని క్రీడా వర్గాలు కోరుకుంటున్నాయి.