News February 6, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయన వెంట వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు నిర్ణయాలపై అధిష్ఠానానికి రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల విషయంపైనా ఆయన చర్చించవచ్చని సమాచారం.
Similar News
News March 25, 2025
BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

TG: రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ 3 నుంచి 4 ఎకరాల్లోపు అన్నదాతల ఖాతాల్లో రూ.200 కోట్ల డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఆ కేటగిరీలో ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్లు రిలీజ్ చేసినట్లయ్యింది. మొత్తంగా 54.74 లక్షల రైతులకు రూ.4,666.57 కోట్లు అందించింది. ఈ నెలాఖరులోపు రైతులందరి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
News March 25, 2025
శ్రేయస్ తన సెంచరీ కోసం చూడొద్దని చెప్పారు: శశాంక్

GTతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(97*) సెంచరీ మిస్ అయిన విషయం తెలిసిందే. అయితే మరో ఎండ్‌లో శశాంక్ హిట్టింగ్ చేయడంతో అయ్యర్‌కు స్ట్రైక్ రాలేదు. ఇన్నింగ్స్ తర్వాత శశాంక్ దీనిపై మాట్లాడుతూ.. ‘నా సెంచరీ కోసం చూడొద్దు. నువ్వు షాట్లు ఆడు’ అని శ్రేయస్ తనతో చెప్పారన్నారు. తన వ్యక్తిగత స్కోర్ కోసం కాకుండా జట్టు కోసం ఆలోచించిన కెప్టెన్ అయ్యర్‌ను ఫ్యాన్స్ పొగుడుతున్నారు.
News March 25, 2025
ఆ హీరోయిన్ మృతితో హీరోకు సంబంధం లేదు: మాజీ ప్రియుడు

దక్షిణ కొరియా నటి <<15483613>>కిమ్ సె రాన్<<>> మృతికి నటుడు కిమ్ సూ హ్యూన్, మరో యూట్యూబర్ కారణం కాదని ఆమె మాజీ ప్రియుడు స్పష్టం చేశారు. నిజానికి తనను పట్టించుకోని కుటుంబం వల్లే ఆమె ఎంతో వేదన చెందారని తెలిపారు. న్యూయార్క్‌లో ఆమె రహస్యంగా ఒకరిని పెళ్లిచేసుకొని లైంగిక బంధం కొనసాగించారని వెల్లడించారు. ఇన్నాళ్లూ పట్టించుకోని కుటుంబం ఇప్పుడొచ్చి వేరొకరిని నిందిస్తుండటం బాధాకరమని విమర్శించారు.