News June 23, 2024

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చ!

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేయనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. అనంతరం నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని సమాచారం. అలాగే ఎంపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపైనా పార్టీ పెద్దలు ఆరా తీస్తారని తెలుస్తోంది.

Similar News

News July 6, 2025

ఉపవాసంతో ఎన్ని లాభాలంటే?

image

పుణ్యం కోసం చేసినా, ఆరోగ్యం కోసం చేసినా ఉపవాసం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*శరీరం డీటాక్సిఫై అవుతుంది
*జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
*ఉపవాసంలో పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
*ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది
*శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు

News July 6, 2025

టెక్సాస్ వరదలు.. 32కు చేరిన మృతుల సంఖ్య

image

అమెరికాలోని టెక్సాస్‌లో అకాల వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెర్ కౌంటీ షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరదల వల్ల చనిపోయినవారి సంఖ్య 32కు చేరుకుంది. మృతుల్లో 18 మంది పెద్దవాళ్లుకాగా.. 14 మంది చిన్నారులు ఉన్నారు. గల్లంతైన 27 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రికవరీ చేసిన 8 మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోతున్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు ట్రంప్ సానుభూతి తెలియజేశారు.

News July 6, 2025

తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

image

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.