News June 27, 2024

ఎల్లుండి వరంగల్‌కు సీఎం రేవంత్!

image

TG: సీఎం రేవంత్ వరంగల్ పర్యటన ఎల్లుండికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం ఢిల్లీలో ఉన్నారు. రేపు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉండటంతో పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. కాగా వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనున్నారు.

Similar News

News December 9, 2025

తొలి టీ20: టాస్ ఓడిన భారత్

image

కటక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయాల నుంచి కోలుకున్న హార్దిక్, గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
IND: సూర్య(C), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్
SA: మార్క్రమ్(C), డికాక్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, జాన్‌సెన్, మహరాజ్, నోర్ట్జే, సిపామ్లా, ఎంగిడి

News December 9, 2025

సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

image

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్లో ₹5,39,495 కోట్ల పెట్టుబడులు

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2 రోజుల సదస్సులో ఇప్పటివరకు రూ.5,39,495 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మొదటి రోజు రూ.2,43,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేలా వివిధ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇక రెండో రోజైన మంగళవారం సాయంత్రం వరకు మరో రూ.2,96,495 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. IT, POWER, TOURISM, FOREST తదితర విభాగాల్లో ఇవి వచ్చాయి.