News June 27, 2024

ఎల్లుండి వరంగల్‌కు సీఎం రేవంత్!

image

TG: సీఎం రేవంత్ వరంగల్ పర్యటన ఎల్లుండికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం ఢిల్లీలో ఉన్నారు. రేపు కూడా ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉండటంతో పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. కాగా వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనున్నారు.

Similar News

News December 12, 2024

Mobikwik IPO: 10X స్పందన.. ఎందుకీ క్రేజ్

image

మొబీక్విక్ IPO అదరగొడుతోంది. రెండోరోజు 12PMకే 10X స్పందన లభించింది. ఇష్యూ ధర రూ.279తో పోలిస్తే GMP 53% ఎక్కువగా ఉంది. ఇన్‌స్టిట్యూషనల్స్ ఎక్కువగా ఎగబడుతున్నారు. ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు, రేటింగ్ సంస్థల రేటింగ్స్, 161 మిలియన్ల యూజర్ బేస్, డిజిటల్ పేమెంట్స్, క్రెడిట్, ఇన్వెస్ట్‌మెంటు, దేశంలోని 99% పిన్‌కోడ్స్ పరిధిలో సేవలందిస్తుండటం ప్లస్‌పాయింట్స్. DEC 18న షేర్లు NSE, BSEలో లిస్ట్ అవ్వనున్నాయి.

News December 12, 2024

వారికీ పింఛన్లు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

image

AP: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈమేరకు ఆయన సూచించారు. ఇక రానున్న 3 నెలల్లో అనర్హులను గుర్తించి పింఛన్లు కట్ చేయాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

News December 12, 2024

అదానీకి రూ.27వేల కోట్ల లాభం.. షేర్ల జోరు

image

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు జోరుమీదున్నాయి. ఇవాళ ఒక్కరోజే గ్రూప్ విలువ రూ.27వేల కోట్ల మేర పెరిగింది. రాజస్థాన్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ 250MW సోలార్ పవర్ ప్రాజెక్టును ఆరంభించింది. కంపెనీ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 11,434MWకు పెరగడంతో ఈ షేర్లు 7.1% లాభపడి రూ.1229 వద్ద చలిస్తున్నాయి. అదానీ పవర్ 5.6, ఎనర్జీ సొల్యూషన్స్ 3, టోటల్ గ్యాస్ 2.3, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.7, NDTV 1.7% మేర ఎగిశాయి.