News April 29, 2024
రేపు కర్ణాటకకు సీఎం రేవంత్

TG: ఓ వైపు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే పక్క రాష్ట్రాల్లోని పార్టీ అభ్యర్థుల కోసం సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నారు. రేపు ఆయన కర్ణాటకలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ చీఫ్ ఖర్గేతో కలిసి గుర్మిట్కల్ ప్రచార సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సేడంలో ప్రియాంక గాంధీతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు.
Similar News
News November 13, 2025
ఇతిహాసాలు క్విజ్ – 65

ఈరోజు ప్రశ్న: దేవవ్రతుడు ఎవరు? ఆయన ఏమని ప్రతిజ్ఞ చేశాడు? ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 13, 2025
ఐబీలో 258 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 258 ACIO పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 16 ఆఖరుతేదీ. B.E./B.Tech/M.Tech ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. వెబ్‌సైట్: https://www.mha.gov.in/
News November 13, 2025
12 నెలల వేతనాల చెల్లింపునకు నిధులు విడుదల

AP: రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజన్ల వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం రూ.90 కోట్లు విడుదల చేసింది. ఇమామ్‌లకు నెలకు రూ.10,000, మౌజన్‌కు నెలకు రూ.5వేల చొప్పున 2024 ఏప్రిల్-జూన్, 2025 జనవరి-సెప్టెంబర్ నెలలకు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం, సాధికారతకు కట్టుబడి ఉందని తెలిపారు.


