News November 17, 2024

ఈనెల 20న వేములవాడకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వేములవాడ ఆలయం, జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం పర్యటన ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాగా ఎల్లుండి వరంగల్‌లో సీఎం పర్యటించనున్నారు.

Similar News

News November 20, 2025

పంచాయతీ ఎన్నికలపై కీలక సమీక్ష

image

TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. CS రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్షించారు. స్థానిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. కాగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 11, 14, 17న ఎలక్షన్స్ జరుగుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News November 20, 2025

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి

image

TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తయింది. ఆయన తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 10 మందిలో తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డా.సంజయ్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య విచారణకు హాజరయ్యారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి హాజరుకాలేదు.

News November 20, 2025

బండి సంజయ్‌పై పేపర్ లీకేజీ కేసు కొట్టివేత

image

TG: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ‌య్‌పై దాఖలైన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టేసింది. 2023లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి కారణమంటూ కమలాపూర్ PSలో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఆయన HCని ఆశ్రయించగా సరైన సెక్షన్లు, ఆధారాలు లేవంటూ తాజాగా కేసును క్వాష్ చేసింది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి KTR, గోరటి వెంకన్నపై దాఖలైన FIRనూ HC కొట్టివేసింది.