News November 17, 2024
ఈనెల 20న వేములవాడకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వేములవాడ ఆలయం, జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం పర్యటన ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాగా ఎల్లుండి వరంగల్‌లో సీఎం పర్యటించనున్నారు.
Similar News
News March 6, 2026
మరోసారి బొత్సకు అస్వస్థత

AP: శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ అధికారులు అత్యవసరంగా వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా ఇటీవల బొత్సకు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్‌లో <<19252802>>చికిత్స<<>> తీసుకున్న విషయం తెలిసిందే.
News March 6, 2026
ఎస్సీ వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది: సీఎం రేవంత్

TG: సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత SC వర్గీకరణపై ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని CM రేవంత్ చెప్పారు. HYDలో మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వర్గీకరణలో మాదిగల వైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మీవైపే నిలబడ్డాను. భారతంలో నా ఫేవరెట్ క్యారెక్టర్స్ కర్ణుడు, బర్బరీకుడు. కర్ణుడి మాదిరిగా మాదిగల విషయంలో మిత్ర ధర్మం పాటిస్తూ బర్బరీకుడిలా పనిచేశా’ అని తెలిపారు.
News March 6, 2026
RECORD: దేశంలోనే పిన్నవయసు CA

రాజస్థాన్‌కు చెందిన రాజ్‌కుమారి పరేఖ్ చరిత్ర సృష్టించారు. దేశంలోనే అత్యంత పిన్నవయసు ఛార్టెర్డ్ అకౌంటెంట్ (CA)గా నిలిచారు. ఇటీవల సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత సాధించారు. 19 ఏళ్ల 126 రోజుల్లోనే ఈ ఘనత సాధించారు. అంతకుముందు ఈ రికార్డు మధ్యప్రదేశ్‌కు చెందిన నందినీ అగర్వాల్ (19 ఏళ్ల 330 రోజులు) పేరిట ఉండేది. కాగా దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో సీఏ ఒకటి.


