News May 18, 2024

సీఎం రేవంత్ టెన్షన్‌లో ఉన్నారు: DK అరుణ

image

TG: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ సీట్లు తగ్గితే తన సీటుకు ఎసరు వస్తుందని సీఎం రేవంత్ టెన్షన్ పడుతున్నారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. ఆయనకు పాలన అనుభవం లేదని, అందుకే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఆమె విమర్శించారు. రేవంత్ రాజకీయాలు పక్కనపెట్టి మొదట ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ 10-12సీట్లు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News December 6, 2024

అల్లు అర్జున్‌కు జైలు శిక్ష పడుతుందా?

image

HYD సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి PSలో కేసు నమోదైంది. BNS చట్టంలోని సెక్షన్ 105(హత్య కాని ప్రాణనష్టం కేసు), 118(1) వంటి నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే 5 నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది. బన్నీ వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏం జరుగుతుందో చూడాలి.

News December 6, 2024

STOCK MARKETS: ఐటీ, మీడియా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్

image

RBI MPC మీటింగ్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. వడ్డీరేట్ల తగ్గింపుపై రకరకాల అంచనాలు ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 24,712 (+4), సెన్సెక్స్ 81,784 (+23) వద్ద ట్రేడవుతున్నాయి. IT, మీడియా, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఆటో, FMCG, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. TCS, LT, WIPRO టాప్ లూజర్స్.

News December 6, 2024

గ్రూప్-1,2,3 ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో గ్రూప్-1, 3 పరీక్షలు జరగ్గా, ఈ నెలలో గ్రూప్-2 నిర్వహించనున్నారు. తొలుత గ్రూప్-1 ఫలితాలు, పోస్టుల భర్తీ.. ఆ తర్వాత గ్రూప్-2 ఫలితాలు, భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. చివర్లో గ్రూప్-3 ఫలితాలు రిలీజ్ చేస్తారని సమాచారం. ఇలా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అన్ని గ్రూప్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. మెరిట్ ఉన్న నిరుద్యోగులు అవకాశాలు కోల్పోకూడదని TGPSC ఇలా కొత్త విధానం అమలు చేయనున్నట్లు సమాచారం.